News

త్వరలో బీసీ కమిషన్ ఏర్పాటు


బీసీ కులాల సమగ్ర అభివృద్ధి కోసం త్వరలో బీసీ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన బీసీ సంక్షేమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సమాజంలో సగభాగం ఉన్న బీసీల పురోగతి తక్షణ అవసరమన్నారు. బీసీ కులాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రముఖులతో త్వరలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. వారి కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. బీసీ స్టడీ సర్కిల్లో అత్యున్నత ప్రమాణాలు ఉండేలా తీర్చిదిద్దుతామని కేసీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, బీసీ సంక్షేమ శాఖాధికారులు పాల్గొన్నారు.